తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్కలు చెప్పండి: ఏడుగురు ఐకేపీ సిబ్బందిని బంధించిన రైతులు - జగిత్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందిని బంధించిన రైతులు

జగిత్యాల జిల్లా బుగ్గారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగాయంటూ ఏడుగురు ఐకేపీ సిబ్బందిని రైతులు నిర్బంధించారు. తమకు రావాల్సిన డబ్బుని చెల్లించాలంటూ డిమాండ్​ చేశారు.

Farmers detained by IKP staff  in jagtyala buggaram grain purchasing center
లెక్కలు చెప్పాలి.. ఏడుగురు ఐకేపీ సిబ్బందిని బంధించిన రైతులు

By

Published : Jun 16, 2020, 12:16 PM IST

తమ ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ జగిత్యాల జిల్లా బుగ్గారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ఏడుగురు ఐకేపీ సిబ్బందిని రైతులు నిర్భంధించారు. కొనుగోలు కేంద్రంలోని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారిని బంధించారు.

ధాన్యం విక్రయం జరిగి నెల రోజులు గడుస్తున్న డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకంలో కోత విధిస్తున్నారంటూ మండిపడ్డారు. గత ఖరీఫ్ ధాన్యం డబ్బులను ఐకేపీకి చెందిన వ్యక్తి తన ఖాతాలోకి ఎలా వేసుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని రైతులతో మాట్లాడారు. జిల్లా ప్రాజెక్ట్ అధికారి మల్లేశం గ్రామానికి వచ్చి రైతు వారీగా లెక్కలు చెప్పాలని సిబ్బందిని ఆదేశించారు. ఐకేపీ సిబ్బందిని విడిపించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details