మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రధాన రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.
మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు - జగిత్యాల జిల్లాలో రైతుల ా
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు
నిబంధనల పేరిట అధికారులు తక్కువ మొత్తంలో మక్కలు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతన్నలు హెచ్చరించారు.