తెలంగాణ

telangana

ETV Bharat / state

సంతోషంలో పసుపు రైతు.. క్వింటా ధర రూ. 10,220 - turmeric rates in metpally market

పసుపు పంట సాగుకు తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ధర రూ. 10,220 పలికింది.

Farmers are happy that the price of turmeric is rising day by day
సంతోషంలో పసుపు రైతు.. క్వింటా ధర రూ. 10,220

By

Published : Mar 4, 2021, 9:04 AM IST

పసుపు ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం నాడు క్వింటా ధర రూ. 10,220 పలికింది. మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే రూ. 1,311 అధికంగా ధర పలకడంతో రైతులు ఆనందంతో ఉన్నారు.

మెట్​పల్లి మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా జరుగుతున్న పసుపు కొనుగోళ్లను వ్యాపారులు వారికి నచ్చిన ధరకు సొంతం చేసుకుంటున్నారు. రంజిత్ అనే రైతు వద్ద నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారి క్వింటాలుకు రూ. 10,200 వెచ్చించి కొనుగోలు చేశారు. కాడిరకం రూ. 10200, గోలరకం రూ. 7,777, చూరరకం రూ 6, 416 ధర పలుకుతోంది.

మార్కెట్లో పసుపు కొనుగోళ్లు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 15,939 క్వింటాళ్ల పసుపును కొనుగోలు జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు మంచి పసుపును తీసుకొస్తే వ్యవసాయ మార్కెట్లో అనుకున్న ధర వస్తుందని రైతులకు సూచించారు. రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:బీమా క్లెయిమ్‌ కేసులో తవ్వే కొద్దీ నిజాలు

ABOUT THE AUTHOR

...view details