తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని వేడుక చేసుకున్న కుటుంబం - వేడుక చేసుకున్న కుటుంబం

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఎలా వదిలించుకోవాలని చూసేవారు. కానీ కాలం మారుతోంది. నేడు ఆడబిడ్డ పుడితే వేడుక చేసుకుంటున్నారు. మహాలక్ష్మితో కోడలు ఇంటికి వచ్చిందని అత్తింటివారు ఇల్లంతా పూలతో అలంకరించి స్వాగతం పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో చోటుచేసుకుంది.

family-members-celebrated-the-birth-of-a-girl-child
ఆడపిల్ల పుట్టిందని వేడుక చేసుకున్న కుటుంబం

By

Published : Jan 25, 2021, 11:49 AM IST

ఆడపిల్ల పుట్టిందని కన్నీరు పెట్టుకునే రోజులు పోయి వేడుక చేసుకునే రోజులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో చోటుచేసుకుంది. పల్లికొండ మహేశ్‌-అశ్విని దంపతులకు కుమార్తె జన్మించింది. తొలిసారి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చే సమయంలో ...మహాలక్ష్మితో కోడలు ఇంటికి వచ్చిందని అత్తింటివారు ఇల్లంతా పూలతో అలంకరించి స్వాగతం పలికారు.

సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని సంబురాలు

ABOUT THE AUTHOR

...view details