తెలంగాణ

telangana

ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన ఇందూర్​ ఎన్నికల ఏర్పాట్లు - EVMS READING FOE POLLING

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందూరు ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఓ వైపు రైతు అభ్యర్థులు పోలింగ్​ వాయిదా వేయాలని కోర్టును ఆశ్రయించగా... మరోవైపు అధికారులు మాత్రం పరికరాల పనితీరు, ఎన్నికల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. భారీ సంఖ్యలో సిబ్బంది, అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు.

చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు...

By

Published : Apr 5, 2019, 10:31 PM IST

నిజామాబాద్‌ లోక్​సభ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత మూడు రోజుల క్రితం జగిత్యాలకు చేరిన ఈవీఎంలను పరిశీలించి భద్రపరిచే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు. 300 మంది ఇంజినీర్లు, 1200 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌, మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌, జగిత్యాల ఆర్డీవో నరేందర్‌తోపాటు పలుశాఖల అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు...

ఈవీఎంల పనితీరు పరిశీలన...

ఒక్కో ఈవీఎంలో ఒక్కో గుర్తుపై 1200 వరకు ఓట్లు వేసి పనితీరును పరిశీలిస్తున్నారు. సరిగా పని చేయని పరికరాలను అక్కడే ఉన్న ఇంజినీర్లు సరిచేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు సంబంధించి జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను ఉంచగా.. 620 సెట్లకుగాను ఇప్పటి వరకు 350 సెట్ల పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారంలోపు అన్ని సెట్ల పరిశీలనతోపాటు, పోలింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్‌ శరత్​ వెల్లడించారు.

ఇవీ చూడండి: 'ఓటు వినియోగమే కాదు... ఫిర్యాదులూ చేయండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details