పురపాలిక ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పరిధిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. పట్టణంలోని కోదండ రామయ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ - మున్సిపల్ ఎన్నికలు 2020
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి అధికారులు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. రేపు జరగబోయే పుర ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ
ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు. మొత్తం 26 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి... 50 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం