జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరకుండా చేసుకోవచ్చని మున్సిపల్ ఛైర్పర్సన్ సుజాత తెలిపారు. పురపాలిక పరిధిలోని పలు వార్డుల్లో పరిశుభ్రత కోసం ప్రజల నుంచి తడిపొడి చెత్తను సేకరించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
పరిసరాల పరిశుభ్రతకై చెత్తబుట్టల పంపిణీ - మున్సిపల్ ఛైర్పర్సన్ సుజాత
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ సుజాత తెలిపారు. ప్రజలు తడిపొడి చెత్తలను వేరుచేసే విధంగా చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
పరిసరాల పరిశుభ్రతకై చెత్తబుట్టల పంపిణీ
అనంతరం కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలోనే బయట తిరగాలని.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని ఆమె సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్కు ధరించాలని సూచించారు.