జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కొవిడ్ నిర్దరణకు ఉపయోగించే ర్యాపిడ్ టెస్టు కిట్లు అందుబాటులో ఉంచాలని... ప్రజలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు చేయించుకునేందుకు వచ్చి కిట్లు లేక దాదాపు వెయ్యి మంది వరకు వెనుతిరిగారు.
ర్యాపిడ్ టెస్టు కిట్లు లేక వెనుదిరిగిన బాధితులు
జగిత్యాల జిల్లాలో కరోనా నిర్ధరణకు ఉపయోగించే ర్యాపిడ్ టెస్టు కిట్లు నిండికున్నాయి. ఒక్కో పరీక్ష కేంద్రంలో సుమారు 200కు పైగా టెస్టులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... కేవలం 50 నుంచి 75 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో కరోనా కిట్ల కొరత
ఈ రోజు సాయంత్రానికి జిల్లాకు కిట్లు చేరుకుంటాయని... ఎప్పటిలాగే పరీక్షలు నిర్వహిస్తామని వైద్యాధికారులు వెల్లడించారు. జిల్లాలోని రాయికల్ మండల కేంద్రంలో కిట్లు లేకపోవటంతో పరీక్షల కోసం వచ్చిన బాధితులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్