New year drunk and drive: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 89 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఇందులో భాగంగా.. కొందరు మందు బాబులు వీరంగం సృష్టించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ నానా హంగామా చేశారు.
New year drunk and drive: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు
New year drunk and drive: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మందుబాబులు నానా హంగామా చేశారు. మత్తులో వాళ్లు చేసిన వీరంగాలతో పోలీసులకు చుక్కలు కనిపించాయి.
drunkard hulchul in drunk and drive tests conducted in jagtial
జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై నవత నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో కొందరు మందు బాబులు దురుసుగా ప్రవర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వచ్చిన వాళ్లు కొందరు బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించారు. పోలీసులు వారికి అతి కష్టం మీద పరీక్షలు నిర్వహించారు. మరికొందరు తమ వివరాలు తెలిపేందుకు పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. మొత్తం మీద డిసెంబర్ 31 రాత్రి.. మందుబాబులు మత్తులో పోలీసులకు చుక్కలు చూపించారు.
ఇదీ చూడండి: