తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు - తెలంగాణ వార్తలు

డ్రైవర్స్ డే, అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు జగిత్యాల పట్టణంలో నిర్వహించారు. వాహనాలను జాగ్రత్తగా నడపాలని డ్రైవర్‌లకు సుచించారు. హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలని ద్విచక్ర వాహనదారులకు పువ్వులు అందించారు.

Drivers' Day and International Road Safety  in Jagityal
జగిత్యాలలో డ్రైవర్స్ డే, అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

By

Published : Jan 24, 2021, 1:53 PM IST

జగిత్యాల పట్టణంలో డ్రైవర్స్ డే, అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ట్రాఫిక్​పై అవగాహన కల్పించారు.

డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు వాహనాలను జాగ్రత్త నడపాలంటూ.. వారికి పువ్వులు అందజేశారు. జగిత్యాల డిపో నుంచి సాగిన ఈ ర్యాలీ కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ ట్రాఫిక్ ఎస్ఐ అనిల్​తో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:టీమ్​ఇండియాకు గాయాల గోల.. అసలెందుకిలా?

ABOUT THE AUTHOR

...view details