జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలంలో 63వ జాతీయ రహదారిపై టిప్పర్ చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ పైపులు పగలి ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఘటనతో టిప్పర్ సహాయకుడు పరారీ అయ్యాడు.
టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్ సజీవ దహనం - DRIVER LIVE BURNT IN CABIN
చెట్టుని ఢీకొట్టిన టిప్పర్ లారీ బోల్తా పడిన ఘటనలో డీజిల్ పైపులు పగిలి ఇంజన్లో మంటలు చెలరేగి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మణం చెందాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్ని మాపక సిబ్బంది
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇరు వైపులా మంటలు చెలరేగడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు గంట పాటు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇవీ చూడండి : ప్రాణాలు తీసిన అతివేగం...