పట్టణ పరిశుభ్రత కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు మెట్పల్లి పురపాలక ఛైర్పర్సన్ సుజాత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 19వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే నూతన మురుగు కాలువ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ఆమె పనులను ప్రారంభించారు.
మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభం - jagitial district news
మెట్పల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మురుగు కాలువ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి పురపాలక ఛైర్మన్ సుజాత ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రత కోసం దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.
మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభం
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచనల మేరకు పట్టణాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఛైర్పర్సన్ సుజాత తెలిపారు ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్‌ఛైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ