జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మంచాల కృష్ణ, రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వ ఆస్పత్రికి అందజేశారు. వాటితో పాటు 2 వేల మాస్కులు, 100 మంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులను అందజేశారు. కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరుకాగా ఆయన చేతులమీదుగా ప్రభుత్వ వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్ రామకృష్ణకు అందజేశారు.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత - జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మంచాల కృష్ణ, రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వ ఆస్పత్రికి అందజేశారు.
krn
రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంచాల కృష్ణ సమకూర్చగా రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో మరో రెండు అందించారు. ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న రోగులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.రామకృష్ణ, డా.ధీరజ్ రావు, రోటరీ-ఆపి-రెడ్ క్రాస్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టివీ సూర్యం తదితరులు పాల్గొన్నారు.