ETV Bharat / state
వైభవంగా ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - dolosthavam in Dharmapuri temple
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మొదటి రోజు యోగా నరసింహ స్వామి పల్లకిలో మేళ తాళాలతో బ్రహ్మపుష్కరిణికి చేరారు.
వైభవంగా ధర్మపురి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
By
Published : Mar 21, 2019, 7:46 AM IST
| Updated : Mar 21, 2019, 7:54 AM IST
వైభవంగా ధర్మపురి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డోలోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యోగా నరసింహ స్వామి పల్లకిలో మేళ తాళాలతో బ్రహ్మపుష్కరిణికి చేరారు. అర్చకులు స్వామి వారికి హంస వాహనంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారిని మంటపంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. Last Updated : Mar 21, 2019, 7:54 AM IST