జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్, అంబారిపేటలో కుక్కలు స్వైర విహారం చేశాయి. దారిన పోతున్న 8 మందిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారు. పిచ్చి కుక్కల బెడద నుంచి తప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
8మందిపై కుక్కల దాడి..ఆస్పత్రిలో బాధితులు - attock
మేడ్చల్ జిల్లాలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే జగిత్యాల జిల్లా కొండాపూర్, అంబారిపేటలో శునకాలు స్వైర విహారం చేశాయి. దారిన పోయేవారిని రక్తాలు కారేలా కరిచాయి.
కుక్కల దాడి