తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో అసమ్మతి సెగ... తెరాసకు పొగ - జగిత్యాలలో అసమ్మతి సెగ... తెరాసకు పొగ

జగిత్యాల జిల్లాలోని పుర ఎన్నికల్లో భాగంగా తెరాసకు అసమ్మతి సెగ ఎదురైంది. ఆది నుంచి తెరాసలో కొనసాగుతున్న తమను కాదని వేరే వ్యక్తికి బీ ఫామ్ ఇస్తుండటం వల్లే పుష్ప-వెంకటస్వామి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

అసమతితో కాషాయం జెండా కప్పుకున్న పుష్ప-వెంకటస్వామి
అసమతితో కాషాయం జెండా కప్పుకున్న పుష్ప-వెంకటస్వామి

By

Published : Jan 13, 2020, 6:13 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలికలో తెరాసకు అసమ్మతి సెగ తగిలింది. సాదు బత్తుల పుష్ప-వెంకటస్వామి వార్డుల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన 5వ వార్డులో తెరాస తరఫున నామినేషన్ దాఖలు చేశారు. తెరాస పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ తమకు బీ ఫాం రాకుండా అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పుష్ప-వెంకటస్వామి వేసిన నామినేషన్​ను ఉపసంహరించుకుని తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి వెంకట్... వెంకటస్వామి దంపతులకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన వార్డులో పోటీలో ఉన్న తెరాస అభ్యర్థి ఓటమికి కృషి చేస్తానని వెంకటస్వామి వెల్లడించారు. అలాగే భాజపా అభ్యర్థిని... అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

అసమతితో కాషాయం జెండా కప్పుకున్న పుష్ప-వెంకటస్వామి

ఇవీ చూడండి : వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details