సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ అభిమాని అందరికంటే భిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం గంట వ్యవధిలోనే ముఖ్యమంత్రి సైకత శిల్పాన్ని రూపొందించి తన ప్రత్యేక కళను ప్రదర్శించాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గాలిపెల్లి చోళేశ్వర్ సీఎం ప్రతిమను అందంగా తీర్చిదిద్దాడు.
సీఎం సైకత శిల్పం అదుర్స్ - సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కేవలం గంట వ్యవధిలోనే ముఖ్యమంత్రి సైకత శిల్పం తయారు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గాలిపెల్లి చోళేశ్వర్ తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు.
సీఎం సైకత శిల్పాన్ని రూపొందించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తన ఇంటి ఆవరణలో గంట వ్యవధిలో శిల్పాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. అందంగా తయారు చేసిన ఈ శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతను వేములవాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో సీఎం కేసీఆర్‌కు చోళేశ్వర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడు.