జగిత్యాల జిల్లాకు జులై, ఆగస్టు మాసాలకు సంబంధించి కంది పప్పు ఇప్పటి వరకు సరఫరా కాలేదు. సెప్టెంబర్ నెల మొదటి వారం దాటినా పప్పు సరఫరా కాకపోవడం వల్ల ఎదురు చూపులు తప్పడం లేదు. బహిరంగ మార్కెట్లో కంది పప్పు కిలో ధర రూ.100 నుంచి రూ.120లకు పైగా ఉంది.
కంది పప్పు పంపిణీలో జాప్యం - jagityala latest news
పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆహార భద్రత కార్డులున్న ప్రతి ఒకరికి నెలకు కిలో చొప్పున కేంద్రం ఉచితంగా కంది పప్పును పంపిణీ చేస్తోంది. జగిత్యాల జిల్లాకు జులై, ఆగస్టు మాసాలకు సంబంధించి కంది పప్పు ఇప్పటి వరకు సరఫరా కాలేదు.
![కంది పప్పు పంపిణీలో జాప్యం did not distribution kandhi pappu for july, august months in jagityala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8734305-531-8734305-1599632458808.jpg)
కంది పప్పు పంపిణీలో జాప్యం
ప్రస్తుతం పరిస్థితుల్లో పేదలు సరకులు కొనాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంది పప్పు సరఫరా చేయాలని కోరుతున్నారు.