తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రి ఊరులోనే స్మశాన వాటిక లేదు' - ధర్మపురిలో గోదావరి నది

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలో స్మశాన వాటిక లేకపోవడం తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కాంగ్రెస్​ నాయకులు విమర్శించారు.

ధర్మపురిలో కాంగ్రెస్​ నేతల ధర్నా

By

Published : Nov 3, 2019, 1:34 PM IST

ధర్మపురిలో కాంగ్రెస్​ నేతల ధర్నా

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన గోదావరి నదిలో మురుగు నీరు కలవకుండా పనులు చేస్తున్నామని చెప్తున్న తెరాస నాయకులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తలాపున గోదావరి ఉన్నా... తాగడానికి నీరు లేదని వాపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలో స్మశాన వాటిక లేకపోవడం తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details