జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి దీక్షాపరులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు - jagtial latest news
కొండగట్టు అంజన్న ఆలయం దీక్షాపరులతో కిక్కిరిసిపోయింది. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆలయం మూసివేయనున్న క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Kondagattu Anjanna Temple, jagtial district
ఈ నెల 25 నుంచి 30 వరకు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కరోనా దృష్ట్యా ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.