షష్ఠి మల్లన్న ఉత్సవాలను పురస్కరించుకుని.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని మల్లన్న దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోరమీసాల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు.
జగిత్యాల మల్లన్న ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు - బోనాలు
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో.. మల్లన్న షష్ఠి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు.

జగిత్యాల మల్లన్న ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు
అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్వాహకులు.. అధిక సంఖ్యలో తరలివస్తోన్న భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:ఘనంగా దత్తసాయి జయంతి ఉత్సవాలు