జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కాశీబాగ్ ఆంజనేయస్వామికి మండలదీక్ష భక్తులు అభిషేకాలు నిర్వహించారు. వేకువ జామున నుంచే స్వామివారికి పంచామృతాభిషేకం, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.
మెట్పల్లి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం - మెట్పల్లి ఆలయంలో పూజలు
హనుమాన్ మండలదీక్ష భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
![మెట్పల్లి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం Hanuman Chalisa at Metpally Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11178011-353-11178011-1616827742036.jpg)
మెట్పల్లి ఆలయంలో ఆంజనేయస్వామికి పూజలు
వెయ్యి కమల పుష్పాలతో ఆంజనేయస్వామిని అలంకరించారు. మండలదీక్ష భక్తులు భజనలు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.