అన్ని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో రూ. 18 లక్షలతో నిర్మించబోయే సైన్స్ ల్యాబ్‌కు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి, బర్తీపూర్లో రూ. 64 లక్షలతో నిర్మించబోయే కుల సంఘ భవనాలు, వేములకుర్తి గ్రామంలో రూ. 48 లక్షల 76 వేలతో నిర్మించబోయే సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత తెలిపారు.
'సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం' - అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.
'సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం'