జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పరిశీలించారు. రోజుల తరబడి ఉన్నా.. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవటం వల్ల జీవన్‌రెడ్డి ముందు అన్నదాతలు గోడు వెల్లబోసుకున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులు నష్టపోతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. జీవన్‌రెడ్డి ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లుగా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని.. రైతుల నుంచి అదనపు తూకం వేసి దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. జీవన్‌రెడ్డి ఆగ్రహం
తేమ శాతం సరిగ్గా ఉన్నా కొనుగోళ్లు జరపటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి :'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'