జగిత్యాల జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శమీ పూజ జరిగింది. అనంతరం జంబి గద్దె వద్ద నిర్వహించిన శమీ పూజలో కలెక్టర్ రవి, జేసీ రాజేశం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాలలో ఘనంగా శమీ పూజలు - జగిత్యాలలో శమీపూజలు తాజా వార్త
జగిత్యాలలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగిన శమీపూజ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్ రవి, జేసీ రాజేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జగిత్యాలలో ఘనంగా శమీ పూజలు
ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొంత తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారిని ఊరేగించారు. వేడుకల సందర్బంగా మహిషాసుర దహన కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
ఇదీ చూడండి:పండగపూట భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ