కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు - telangana news
జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
కొండగట్టు అంజన్న ఆలయం, జగిత్యాల జిల్లా వార్తలు, అంజన్న సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు
ఆలయంలో అభిషేకాలు, వ్రతాలు, వాహనపూజలతో పాటు దీక్షాపరులకు మాలధారణ, విరమణ చేయమని అర్చకులు చెప్పడం వల్ల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తలనీలాలు తీయడానికి నాయీబ్రాహ్మణులు విముఖత చూపడం వల్ల కల్యాణకట్టలో కేశఖండన రద్దు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సాధారణ దర్శనం మాత్రమే ఉంటుందని చెప్పారు.