కరోనా.. ఈ పేరు వింటేనే జగిత్యాల జిల్లా ప్రజలు భయందోళనతో వణికిపోతున్నారు. మహమ్మారి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. పది రోజులుగా జిల్లావ్యాప్తంగా వందలాది కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాల మంది వైరస్ బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఒకే కుంటుంబంలో ముగ్గురు...
జగిత్యాల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన దొంతుల రాంచంద్రం కుటుంబంలో కరోనా పెను విషాదాన్ని మిగిల్చింది. వారి ఇంట్లో అందరికి కరోనా రాగా ముందుగా పెద్ద కొడుకు సునీల్ మృతి చెందాడు. ఆ తర్వాత రాంచంద్రం... ఆయన తరువాత చిన్న కొడుకు మరణించాడు. ఇలా వారం వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు పోచమ్మవాడకు చెందిన గౌతమి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.