కార్తిక చతుర్దశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ - huge no of devotees at dharmapuri temple
కార్తిక చతుర్దశిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
![ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ Crowds of devotees at the Dharmapuri Lakshminarasimha Temple due to karthika chathurdashi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9862219-386-9862219-1607844679940.jpg)
ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ
అనంతరం ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. షష్టి మల్లన్న ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో గోదావరినదిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇదీ చూడండి:ప్రకటనలకే పరిమితం.. కానరాని ప్రత్యామ్నాయం