కరోనాతో మృతి చెందిన వృద్ధుడి అంత్యక్రియలకు సాయం చేసి ఉదారత చాటుకున్నారు పలువురు యువకులు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందగా... అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
కరోనా మృతుని అంత్యక్రియలకు ఆ నలుగురి సాయం - covid death
కరోనా మృతుడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోతే... తామున్నామంటూ పలువురు యువకులు మానవత్వం చాటుకున్నారు. దగ్గరుండి అంత్యక్రియలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
cremations to corona dead body in raikal
ఈ క్రమంలో కోరుట్లకు చెందిన భాజపా నాయకులు సాయం అందించి ఉదారత చాటుకున్నారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని శ్మశానవాటికకు చేర్చారు. మృతుడి కుమారుడు పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు పూర్తి చేశాడు.