కరోనా టీకా జగిత్యాల జిల్లాకు చేరింది. టీకాను జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో భద్రపరిచారు. టీకా నిలువ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
జగిత్యాలకు కరోనా టీకా.. పటిష్ఠ భద్రత - kovid vaccine news news
జగిత్యాల జిల్లాకు కరోనా టీకా చేరుకున్నట్లు వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి, కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. ఎదైనా సమస్యలు ఏర్పడితే పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
జిల్లాలో శనివారం రోజున 60 మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి, కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి టీకా వేయనున్నామని పేర్కొన్నారు. టీకా వేసిన తర్వాత ఎదైన సమస్యలు ఏర్పడితే.. వారిని పరిశీలించేందుకు ప్రత్యేక వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందుకోసం జగిత్యాల, మెట్‌పల్లి ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు అందుబాటులో ఉంచామమని శ్రీధర్ వెల్లడించారు.
ఇదీ చూడండి:మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు