కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఆలయాల్లో వేడుకలు నిరాడంబరంగా జరుపుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజు రాములోరి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సారి కల్యాణ వేడుకను అంతర్గతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి 21 వరకు భక్తుల దర్శనాలను రద్దు చేశారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ఈసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు, రాములోరి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరగనుండగా... భక్తులు లేకుండానే నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.