తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో కరోనా విజృంభణ.. అవగాహన కల్పిస్తున్న అధికారులు - మెట్​పల్లి వార్తలు

కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. పాజిటివ్​ కేసులు పెరిగి ప్రజలు ఆందోళనకు గురి కాకుండా అధికారులు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అప్రమత్తమయ్యారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఒకేరోజు నలుగురికి పాజిటివ్​ అని తేలింది.

Covid cases in Jagitial district metpally
మెట్​పల్లిలో కరోనా విజృంభణ.. అవగాహన కల్పిస్తున్న అధికారులు

By

Published : Aug 4, 2020, 7:20 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతున్నది. అప్రమత్తమైన అధికారులు కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. మెట్​పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం 27 మందికి కరోనా టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్ అని తేలింది.

పెరుగుతున్న పాజిటివ్​ కేసుల పట్ల ఆందోళన చెందుతున్న ప్రజలకు అధికారులు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. పురపాలికలోని చైతన్యనగర్, రెడ్డికాలనీకి, మార్కెట్ ఏరియాలో కలిపి ముగ్గురు, రామ్​నగర్​లో ఓ గర్భిణికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు 128 టెస్టులు చేయగా 27 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా బాధితుల నివాస ప్రాంతాల్లో పురపాలక అధికారులు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. స్థానిక ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి.. అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ABOUT THE AUTHOR

...view details