తెలంగాణ

telangana

ETV Bharat / state

Corruption: విమర్శలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ శాఖ - జగిత్యాలలో అవినీతి ఆరోపణలు

అన్ని పట్టణాల్లో సుందరీకరణ పనులు ఒక రకంగా చేపడితే.. ఇష్టారీతిగా పనులు చేపట్టి జగిత్యాల మున్సిపల్‌శాఖ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. డివైడర్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తున్నాయి. కమీషన్ల కోసమే డిజైన్లు మార్చి... మూడు అడుగుల ఎత్తుకు బదులు రెండు అడుగుల ఎత్తులో నిర్మించి వాటికి రంగులు వేస్తూ... మరిన్ని నిధులు కాజేస్తున్నారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

corruption-in-road-dividers-at-jagtial-municipality
Corruption: విమర్శలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ శాఖ

By

Published : Jun 14, 2021, 2:30 PM IST

తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధులు రూ.3 కోట్లతో జగిత్యాల పట్టణంలోని ధరూరు వాగు నుంచి మంచినీళ్ల బావి వరకు డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణ పనులకు ప్రజారోగ్యశాఖ ద్వారా టెండర్లు పిలిచింది. అయితే తొలత రాతితో కూడిన డివైడర్లు, సెంట్రల్‌లైటింగ్‌, మధ్యలో ఎర్రమట్టితో మొక్కలు ఏర్పాటు చేసే విధంగా టెండరులో పేర్కొన్నారు.

Corruption: విమర్శలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ శాఖ

అడుగడుగునా అవినీతే..

అనూహ్యంగా పాలకులు, అధికారులు కలిసి డివైడర్లకు సంబంధించిన నమూనాల్లో మార్పు చేసి.. కేవలం రెండు అడుగుల ఎత్తులో రాతికట్టడానికి బదులుగా సిమెంటుతో హడావుడిగా పనులు పూర్తి చేశారు. రోడ్డు వేసినప్పుడల్లా... డివైడర్లు మునిగిపోయే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని పట్టణాల్లో రాతి కట్డడాలు నిర్మించగా ఒక జగిత్యాలలో మాత్రమే డిజైన్‌ మార్చారు. హడావుడిగా చేపట్టిన డివైడర్ల నిర్మాణం.. నాసిరకంగా పూర్తిచేశారు. మొక్కల కోసం ఎర్రమట్టి కాకుండా చాలావరకు మొరం పోసి నింపేశారు. మొక్కలు సైతం గుత్తేదారు బయట కొనుగోలు చేయాల్సి ఉండగా హరితహారం మొక్కలు వినియోగించారనే ఆరోపణలున్నాయి. తొలిసారి నాటిన మొక్కల్లో చాలావరకు సంరక్షణ లేక ఎండిపోయాయి.

ప్రజాధనం దుర్వినియోగం

ఇదిలా ఉంటే.. ధరూరువాగు నుంచి మంచినీళ్లబావి వరకు డివైడర్లకు రంగులు వేసేందుకు మరో రూ.25 లక్షలు మంజూరు చేశారు. సింథటిక్‌ ఎనామిల్‌ పెయింట్‌ను వేయాలని నిర్ణయించి టెండరు పిలిచారు. కానీ ఇందులోనూ మార్పులు చేపట్టి టెరాకోట్‌ పెయింట్‌ వేశారు. దీంతో కొత్త బస్టాండు వరకే నిధులు ఖర్చయ్యాయని.. మరో రూ.17 లక్షలు అదనంగా కేటాయించాలని... ఇటీవలె బల్దియా సమావేశంలో ఆమోదం తీసుకుంది. రంగుల పేరిట రూ.42 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. అదే రాతితో నిర్మాణం చేపడితే అసలు రంగులే అవసరం లేకుండా ఉండేదని... ఇంత మొత్తంలో ఖర్చు చేసినా నాణ్యత మాత్రం లేదని ప్రజలు మండిపడుతున్నారు. డిజైన్‌ మార్చి పనులు నాణ్యతగా చేపట్టాలని జగిత్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:Petrol Price: హైదరాబాద్​లోనూ సెంచరీ దాటిన పెట్రోల్

ABOUT THE AUTHOR

...view details