తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో మహమ్మారి విజృంభణ.. కొత్తగా 11మందికి వైరస్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈరోజు 11మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇప్పటివరకు 153 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా 38మంది వైరస్​ బారినపడినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన పురపాలక శాఖ అధికారులు కరోనా నివారణ చర్యలను వేగంవంతం చేశారు.

corona updates at metpally jagtial district
మెట్​పల్లిలో మహమ్మారి విజృంభణ.. కొత్తగా 11మందికి వైరస్​

By

Published : Aug 5, 2020, 7:30 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కరోనా వైరస్​ రోజురోజుకీ విజృంభిస్తోంది. మెట్​పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఈరోజు 25 మందికి కొవిడ్​ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్​గా తేలింది. రాంనగర్​కు చెందిన ఒకరు, మార్కెట్ ఏరియాకు చెందిన ఇద్దరికి, వాసవి హైస్కూల్ దగ్గర ఒకరికి, బోయవాడలో ఒకే కుటుంబానికి చెందిన 4 గురు వైరస్​ బారిన పడినట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 153 మందికి టెస్టులు చేయగా 38 మందికి వైరస్​ సోకిందని వెల్లడించారు.

అప్రమత్తమైన పురపాలక అధికారులు వ్యాధిబారినపడిన వ్యక్తుల వార్డుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఆ వీధి ప్రజలకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ముందస్తుగా పూర్తి జాగ్రత్తలు పాటించాలని పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు.

ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details