కరోనా సోకిన బాధితుడి భార్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జగిత్యాలలో కలకలం రేపింది. కరోనా సోకిన బాధితుడి భార్య కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి జగిత్యాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో బస్సును నేరుగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికే తరలించారు. బస్సులో ప్రయాణించిన ముగ్గురు ప్రయాణికులతో సహా బాధితుడి భార్యను మొత్తం నలుగురిని ఐసోలేషన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌నూ హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.
కరోనా కలకలం : ప్రయాణికులతో ఆస్పత్రికే తరలిన ఆర్టీసీ - GOVERNMENT HOSPITAL LATEST NEWS
జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ నేరుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికే తరలించారు.
కరోనా కలకలం : ప్రయాణికులతో ఆస్పత్రికే తరలిన ఆర్టీసీ
కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకగా అతడ్ని గాంధీకి తరలించారు. గాంధీకి తరలించేవరకు బాధితుడి వెంటే అతని భార్య ఉన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జగిత్యాలకు చేరుకుంది. విషయం తెలుసుకున్న డ్రైవర్ బస్సును నేరుగా జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.