జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో 127మందికి కరోనా సోకగా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో ఒకే కుటంబానికి చెందిన బంధువులకు 27మందికి కరోనా సోకినట్లు నిర్దరణయింది. ఐదు రోజుల క్రితం ఒక వ్యక్తి దినకర్మలో పాల్గొన్న సభ్యుల్లో చాలా మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్దరించారు.
ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా - కరోనా లేటెస్ట్ వార్తలు
17:10 April 01
ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా
ఆరు రోజుల క్రితం జరిగిన దినకర్మలో చాలా మంది పాల్గొన్నారు. గ్రామంలోని దాదాపు 40మంది వరకు పాల్గొన్నారు. ఇందులో కొంత మంది నిన్న ఆస్పత్రికి వెళ్లినప్పుడు కరోనా నిర్ధరణ కాగా వైద్యులు గ్రామంపై దృష్టి సారించారు. గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి 37మందికి పరీక్షలు నిర్వహించగా 27మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ జరిగింది.
మరికొంత మందికి కూడా వైరస్ సోకే అవకాశం ఉందని తెలిపిన వైద్యులు రేపు కూడా గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైరస్ సోకిన వారికి ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.