జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా డీఎస్పీతో సహా 12 మంది పోలీసులకు కొవిడ్ సోకింది. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జిల్లాలో 31 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ 11 కేసులుగా ఉన్నట్లు వెల్లడించగా... అర్ధరాత్రి వరకు మరిన్ని కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు.
జగిత్యాలలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే 31 కేసులు నమోదు - Jagityala corona news
జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 31 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 174కు చేరింది.

జగిత్యాలలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే 31 కేసులు నమోదు
మొత్తం కలిపి 31 కేసులు ఒక రోజులోనే నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో కొడిమ్యాల మండలంలో ప్రాథమిక వైద్యశాలలో పనిచేసే ఇద్దరు ఏఎన్ఎంలు ఉండగా, జగిత్యాల అరవిందనగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మిగతావారు జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.. కొత్త కేసులతో కలుపుకుని జిల్లాలో కేసుల సంఖ్య 174కు చేరింది.