తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో కరోనా పంజా... మరో 44 కొత్త కేసులు

కరోనా మహమ్మారి విజృభిస్తోంది. జగిత్యాల జిల్లాలో కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో మరో 44 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

corona cases increase in jagityala district
corona cases increase in jagityala district

By

Published : Aug 6, 2020, 8:04 AM IST

జగిత్యాల జిల్లాలో మరో 44 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 19 మంది ఉండగా మెట్‌పల్లిలో 11, కొడిమ్యాల మండలంలో 5, మల్యాల, కోరుట్లలో రెండు చొప్పున, ధర్మపురి, వెల్గటూరు, మేడిపల్లి, కథలాపూర్‌, ధర్మపురి మండలాల్లో ఒక్కో కేసు నమోదైంది. 44 కేసుల్లో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జరిపిన పరీక్షల్లో నిర్ధారించారు.

కొడిమ్యాల మండలంలో బుధవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్లు మండల వైద్యాధికారి ఎ.శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా మండల కేంద్రంలో ఇద్దరికి, పూడూర్‌ గ్రామంలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. బుధవారం నమోదైన ఐదు కేసులు కలుపుకుని మండలంలో ఇప్పటి వరకు 19 కేసులు నమోదవగా వీరిలో పదకొండు మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

మెట్‌పల్లి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. సామాజిక ఆసుపత్రిలో 25 మందికి కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఇందులో ఓ మహిళా కౌన్సిలర్‌, ఏడు సంవత్సరాల బాలిక ఉన్నారు.

ధర్మపురిలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇప్పటికి మొత్తం 9 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ధర్మపురితో పాటు అన్ని గ్రామాల్లో కలిపి 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాయికల్‌ పట్టణంలో మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యుడు చైతన్యకృష్ణ తెలిపారు. బాధితులను హోం ఐసోలేషన్‌ ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన 11 మందికి తిరిగి కరోనా నిర్ధరణ పరీక్షలు జరుపగా వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details