జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న మొక్కజొన్నలు తడిచి పోగా, వరి నేల వాలింది. వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల మార్కెట్ యార్డులో 800 క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిచి పోగా... ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు కూడా తడిచి పోయాయి. నీటి ప్రవాహానికి మొక్కజొన్నలు కొట్టుకుపోవటం వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను అకాల వర్షం దెబ్బతీసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
అకాల వర్షంతో అన్నదాతకు కడగండ్లు - corns
జగిత్యాలలో అకాల వర్షం అన్నదాత వెన్నువిరిచింది. కల్లాల్లో ఉన్న మెుక్కజొన్నలతో పాటు మార్కెట్‌యార్డులో మక్కలు వర్షంలో తడిచిపోయాయి. చేతికొచ్చిన పంటను అకాల వర్షం దెబ్బతీసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
అకాల వర్షంతో అన్నదాతకు కడగండ్లు