రైతుబంధు పథకం అమలు పేరిట ముఖ్యమంత్రి రైతులను బెదిరించే ధోరణి అవలంభిస్తున్నారని జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో కాంగ్రెస్ నేత మేడపల్లి సత్యం విమర్శించారు. తన వ్యవసాయ భూమిలో ఏ పంట పండించాలో రైతులు పూర్వీకుల నుంచి నేర్చుకున్నారని వివరించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థానికి పంటల మార్పిడి పేరిట అన్నదాతలను నష్టానికి గురి చేసే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.
చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వరా! - Raithubandhu Scheme
ప్రభుత్వం సూచించిన పంట వేయని వారికి రైతుబంధు పథకం వర్తించదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పంట మార్పిడి పేరిట ప్రభుత్వం రైతులను బెదిరించే ధోరణి అవలంభిస్తుందని కాంగ్రెస్ నేత మేడపల్లి సత్యం విమర్శించారు.
చెప్పిన పంట వేయకపోతే ‘రైతుబంధు’ ఇవ్వరా!
రైతులకు నష్టం వస్తే భరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. అలా ఒప్పుకోని పక్షంలో క్వింటాల్ వరిధాన్యానికి రూ.3 వేలు ప్రకటించాలని కోరారు. రైతుబంధు పథకం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రకటించి నేడు రైతులను గాలికి వదిలేసేందుకు పంట మార్పిడి విధానం ముందుకు తెచ్చారని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ తప్పకుండా ఉద్యమం చేపడుతుందని వెల్లడించారు.