జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రిక్షాలు తొక్కుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇంధన ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన - Congress protest on Hike of Petrol, diesel rates
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రిక్షా తొక్కుతూ కాంగ్రెస్ నాయకుల నిరసన
పెంచిన ధరలు తగ్గించి, సామాన్య ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు.
TAGGED:
dharna