తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధును తొలగించేందుకు ప్రభుత్వం కొత్త మెలికలు: రేవంత్‌రెడ్డి - రైతుబంధుపై రేవంత్ స్పందన

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారనే... ఏపీ ప్రభుత్వంతో పోతిరెడ్డిపాడు జీవోను జారీ చేయించి... ఆ సమస్యను తెర మీదికి తెచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు రైతుబంధును తొలగించేందుకే ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. కొత్త వ్యవసాయ విధానాన్ని ఎండగడుతామని పేర్కొన్నారు.

revanth
revanth

By

Published : May 21, 2020, 7:37 PM IST

45 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా లేవని... మద్యం అమ్మకాల తర్వాత పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరగడానికి సీఎం కేసీఆర్ స్వార్థమే కారణమని విమర్శించారు. దేశంలోనే అతితక్కువ పరీక్షలు తెలంగాణలోనే చేస్తున్నారని పేర్కొన్నారు.

పాజిటివ్ వచ్చినవాళ్లను కూడా 14 రోజుల తర్వాత టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్‌ చేస్తున్నారని అన్నారు. జగిత్యాల ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో రత్నాకర్‌రావు కుటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్... కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. రైతుబంధు విషయంలో కొత్త మెలికలు పెట్టి.. రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశ్యంలా కనిపిస్తోందని ఆరోపించారు.

రైతుబంధును తొలగించేందుకే ప్రభుత్వం ఈ చర్యలు: రేవం

ఇదీ చదవండి:నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ సమావేశం

ABOUT THE AUTHOR

...view details