హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్... ప్రజలను దృష్టి మళ్లించేందుకు రైతులపై ప్రేమ ఉన్నట్టు కపటనాటకము ఆడుతున్నారని జీవన్ రెడ్డి (jeevan reddy on paddy procurement) ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య కార్యక్తల సమావేశానికి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దుతు ఇవ్వాలని కోరారు.
రైతు నల్ల చట్టాలను (CENTRES DECISION TO REPEAL THREE FARM LAW) కేంద్రం రద్దు చేయడం ఎంతో శుభపరిణామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని సూచించారు. కేంద్రం 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు పది లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆరోపించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ఇద్దరు కలిసి ఆటలాడుతూ రైతులను నష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు.