కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భాజపా, తెరాస రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర కోల్పోవాల్సి వస్తుందన్నారు.
సన్నవరి సాగు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : జీవన్ రెడ్డి - jagtial dist latest updatess
రాష్ట్రంలో సన్నవరి సాగు చేసి నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందజేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సుమారు 30 లక్షల ఎకరాల్లో మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు.
![సన్నవరి సాగు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : జీవన్ రెడ్డి Congress MLC Jeevan reddy demand to pay paddy loss farmers amount in jagtial dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9465892-81-9465892-1604747192465.jpg)
సన్నవరి సాగు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ ఆదేశాలతో సన్నవరి సాగుచేసిన రైతన్నలు పంటను పూర్తిగా నష్టపోయారని విమర్శించారు. దాదాపు 30 లక్షల ఎకరాల్లో మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని జీవన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.