తెలంగాణ

telangana

ETV Bharat / state

కమీషన్ల కోసమే మూడో టీఎంసీ పనులు : జీవన్​ రెడ్డి - సీఎం కేసీఆర్​పై మండిపడ్డ జీవన్​రెడ్డి

కాళేశ్వరం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోసే సామర్థ్యం లేనప్పుడు మూడో టీఎంసీ పనులు ఎందుకని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్​లో నిర్మిస్తున్న పంపుహౌజ్​ నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులను ఆయన కలిశారు.

congress mlc jeevan reddy comments  on kaleshwaram third tmc project construction  on jagtial district
కమీషన్ల కోసమే మూడో టీఎంసీ పనులు : జీవన్​ రెడ్డి

By

Published : Feb 20, 2021, 10:28 PM IST

రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజు రెండు టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యం లేనప్పుడు కమీషన్ల కోసమే మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారని విమర్శించారు. ఈ పనుల వల్ల వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్‌లో నిర్మిస్తున్న పంపుహౌజ్ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్​తో కలిసి రైతులను కలిశారు. ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న పంట పొలాలను పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ రైతుల భూములు తీసుంటున్నారని రైతులు జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు మద్దతుగా నిలిచి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మూడో టీఎంసీ అనుమతి లేకుండా నిర్మించడంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సైతం కృష్ణానదిపై అనుమతి లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. దీని ఫలితంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతుల భూములు తీసుకోవాలనుకుంటే ఎకరాకు రూ.60 లక్షల చెల్లించి భూములు తీసుకోవాలన్నారు.

అనుమతులు లేకుండా కృష్ణనదిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఆపేయాలి. కేసీఆర్​ మన హక్కులను కాలరాస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు కేవలం కమిషన్​ కోసమే చేపడుతున్నారు. రాష్ట్రం కోసం రైతులందరూ పోరాడలేదా? మీరొక్కరే ఉద్యమం చేశారా? ఎన్​జీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పింది. దక్షిణ తెలంగాణను ఎడారి చేసేందుకు ఏపీ సీఎం జగన్​మోహన్​ రెడ్డితో సీఎం కేసీఆర్​ చీకటి ఒప్పందం చేసుకున్నారు. టి.జీవన్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

ఇదీ చూడండి :సీఎం ప్రోద్భలంతో భాజపా కార్యకర్తలపై కేసులు: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details