దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తోందని... టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం ధ్వమెత్తారు. నూతన సాగు చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ... కొడిమ్యాల మండలం పూడురులో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల - కరీంనగర్ రహదారిని దిగ్బంధించారు.
'కేంద్రం రైతుల ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేస్తోంది' - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నాలు చేస్తోందని... టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. నూతన సాగు చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడురులో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
కేంద్రం రైతుల ఆందోళనను అణిచివేసే ప్రయత్నిస్తోంది
72 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రహదారుల దిగ్బంధం చేపట్టినట్లు ఆయన తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని వెల్లడించారు. రాస్తారోకోతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: వేములవాడ రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి