సీఎం కేసీఆర్ హయాంలో ఒక యాదాద్రి ఆలయం తప్ప మిగతా దేవాలయాలన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్దిని గాలికొదిలేశారంటూ... కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కొండగట్టు కింది నుంచి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు. వై జంక్షన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరగ్గా.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అనుమతించకపోవటంతో.. రోడ్డుపైనే బైఠాయించి నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'కొండగట్టు అభివృద్ధిని సీఎం కేసీఆర్ గాలికొదిలేశారు..' - kondagattu temple
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్దిని సీఎం గాలికొదిలేశారంటూ... కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జి మేడిపల్లి సత్యం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
"టెంపుల్ కారిడర్గా కరీంనగర్ జిల్లాకు పేరున్నా.. యాదాద్రి తప్ప మరే ఆలయం అభివృద్ది జరగలేదు. మిగతా ఆలయాలన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయి. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా కొండగట్టుని దర్శించుకోలేదు. బస్సు ప్రమాదంలో 50 మందికిపైగా చనిపోయినా.. కనీసం పరామర్శకు రాలేదు. ఏడు సంవత్సరాల్లో కొండగట్టుకి రూపాయి కూడా కేటాయించలేదు. హనుమాన్ జయంతికి లక్షాలాది భక్తులు వస్తారు. అయినా అభివృద్ది మాత్రం చేపట్టడం లేదు. ప్రభుత్వం బాధ్యతగా వేములవాడ, కొండగట్టు దేవాలయాలని అభివృద్ధి చేయాలి. ఏడాదికి వందకోట్లు వేములవాడ దేవస్థానానికి కేటాయిస్తానని చెప్పి.. ఆ మాటను మరిచిపోయారు. కేవలం చిన్నజీయర్ సూచనతో మాత్రమే యాదాద్రి అభివృద్ధి చెందింది" -జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: