తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - jagtial district latest news

కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో మద్దతు ధర కంటే తక్కువకు పంటని కొనుగోలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

congress-collection-of-signatures-in-jagtial-district by mlc jeevan reddy
నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By

Published : Nov 8, 2020, 8:09 PM IST

అతివృష్టి, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జగిత్యాలలో నిర్వహించారు. సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పంటని మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి రైతులు, రైతు నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details