తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన - Telangana news

జగిత్యాల జిల్లాలో విద్యుత్​ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను ఉపసంహారించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన

By

Published : Feb 3, 2021, 2:11 PM IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుకు నిరసనగా ఉద్యోగులు, కార్మికులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో శాఖలోని అన్ని సంఘాలు పాల్గొన్నాయి. విద్యుత్ సవరణ బిల్లు, పంపిణీ సంస్థలపై ప్రైవేటీకరణ కోసం రూపొందించిన స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను ఉపసంహారించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ చర్యలు ఆపాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు రంగంలో కొనసాగుతున్న ప్రైవేట్ విద్యుత్తు లైసెన్స్‌లు రద్దు చేయాలన్నారు. కేఎస్‌ఈబీ లిమిటెట్‌ మాదిరిగా అన్ని జనరేటింగ్‌ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు.

ఇదీ చదవండి:లైవ్ వీడియో: వివాహితపై గొడ్డలితో దాడి.. రాహుల్​ చిక్కాడు!

ABOUT THE AUTHOR

...view details