ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
'రవాణా శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం' - డాక్టర్ శరత్
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తోన్న కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
'రవాణా శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం'